ప్రముఖ నటి ఎంఎల్ఏ జయసుధా భర్త నితిన్ నిన్న రాత్రి ఒక ప్రమాదం నుండి తప్పించుకున్నారు. నిన్న ఆయాన ప్రయాణిస్తున్న మారుతీ స్విఫ్ట్ కారు గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే కారులో నుండి పొగలు వచ్చాయి. అ తరువాత కారులో మంటలు వ్యాపించాయని తెలిసింది. కారు నడుపుతున్నపుడు పొగలు రావడం గమనించిన నితిన్ కారు బయటకు వచ్చేశారు. దానితో ఆయనకు ప్రమాదం తప్పింది. కానీ ఆ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం జరిగింది. ఇది కారులో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చునని బావిస్తున్నారు. అయితే కొన్ని సందర్బాలలో అధిక శక్తి గల లాంపులను ఉపయోగించడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.