ప్రేమ వివాహానికి ఓకే అంటున్న ఆది

Aadi
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆది ‘ప్రేమ లేకపోతే జీవితమే లేదు, ప్రేమ వివాహానికి నేను సిద్దమే’ అంటున్నాడు. ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు ఇదేదో సినిమా కోసం అనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే ఎందుకంటే అతను చెప్పించి తన నిజ జీవితంలో జరగబోయే పెళ్లి గురించే.

ఈ యంగ్ హీరోని పెళ్లి విషయం గురించి అడిగితే ‘ ప్రేమ లేనిదే జీవితం లేదు.. అయితే ప్రేమ వెనుక మనం పడకూడదు అలాఅని మనల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం వద్దనకూడదు. ప్రేమ పెళ్లి అంటే మా ఇంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. మంచి అమ్మాయి అయితే ప్రేమ పెళ్లి చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని మా అమ్మ చెప్పింది, నాన్న అభిప్రాయం మాత్రం తెలీదు. ప్రస్తుతానికయితే ప్రేమ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే నా దృష్టంతా సినిమాలపైనే ఉండడం వల్ల ప్రేమించే తీరిక లేదని’ అన్నాడు. ప్రస్తుతం ఆది ‘రఫ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version