స్టార్ హీరోలతో పనిచేయడం ఇష్టమంటున్న మిల్క్ బ్యూటీ

Thamanna
మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు మరియు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తమన్నా ఓ తెలుగు దినపత్రికతో ముచ్చటిస్తూ ‘ స్టార్ హీరోల పక్కన చేయడం పెద్ద అడ్వాంటేజ్. కానీ కొందరు మీకు పెద్దగా పేరు రాదు ఎందుకంటే క్రెడిట్ మొత్తం హీరోలకే చెందుతుంది అంటారు కానీ హీరియిన్స్ కి స్టార్ హీరోల పక్కన నటించడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. రెగ్యులర్ కమర్షియల్ మూవీలు చెయ్యాలంటే కాస్త కష్టం ఎందుకంటే సినిమా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్ కి దొరికేది కొన్ని సీన్స్ మరియు పాటలు మాత్రమే. కావున మాకున్న తక్కువ టైంలోనే ఆడియన్స్ ని ఆకట్టుకోవాల్సి వస్తుంది. అది మాకొక పెద్ద చాలెంజ్. అదే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలైతే కథ మొత్తం మా చుట్టూనే తిరుగుతుంది కావున మా టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని’ చెబుతోంది.

అలాగే మాట్లాడుతూ ‘ చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలలు ఎక్కువ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళ సినిమాల్లో చేసే వారు ప్రేక్షకులకు చేరువవుతారు. ఆ తక్కువ టైంలోనే వారిని ఆకట్టుకోగలిగితే ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందవచ్చు. అందువలనే కమర్షియల్ సినిమాలను ఇష్టపడి చేస్తానని’ చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ తమన్నా. చూస్తుంటే తమన్నా లెక్కలు నిజమనే చెప్పాలి.

Exit mobile version