ఎంపీగా గెలిచినా నటి రమ్య

MP Ramya

సూర్య సన్ అఫ్ కృష్ణన్ సినిమాలో సూర్యతో కలిసి నటించిన హీరోయిన్ రమ్య (దివ్య స్పందన) కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో లోక్ సభకు పోటిచేసి అతి చిన్న వయసులో ఎంపీగా ఎన్నికై రికార్డ్ సృశించారు. రమ్య ఈ మద్య కర్ణాటకలో జరిగిన ఉపఎన్నికల్లో మాండ్య ప్రాంతం నుండి పోటిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో రమ్య కాంగ్రెస్ తరుపున పోటిచేసిన రమ్య 47,662 ఓట్ల మెజారిటితో గెలుపొందింది. అతిచిన్న వయసులో సినిమా కెరీర్ నుండి మొదటిసారిగా రాజకీయాల్లోకి వెళ్ళిన నటి రమ్య. ఈ సందర్బంగా ఆమె తన గెలుపుకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే తనకున్న పరిదిలో ప్రజలకు సేవచేస్తానని ఆమె వాగ్దానం చేసింది. రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన రమ్యకి 123తెలుగు.కామ్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం .

Exit mobile version