మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరం అయినప్పటికి కొన్ని సినిమాలపై తన అభిప్రాయాన్ని అప్పుడప్పుడు తెలియజేస్తూ వుంటాడు. అలాంటి ఘటన ఈ మద్య ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు జరిగింది. ఈ మద్య వివాదాలలో చిక్కుకున్న ‘మద్రాస్ కేఫ్’ సినిమా గురించి చిరంజీవి తన అబిప్రాయాన్ని తెలియజేశాడు. ఆయన ఈ సినిమా గురించి ‘ఒకసారి సెన్సార్ వారు సినిమాకు ఆమోదం తెలిపిన తరువాత కూడా ఇలాంటి అడ్డంకులు రావడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సినిమా త్వరలో తమిళనాడులో విడుదలవుతుందని నేను అనుకుంటున్నాను’ అని అన్నారు.
తమిళనాడులోని కొంతమంది ఈ సినిమా తమిళులకు వ్యతిరేకంగా వుందని, వారి మనోభావాలను దెబ్బతీసేవిదంగా చిత్రీకరించారని ఈ సినిమాని తమిళనాడులో విడుదలకాకుండా నిలువరించారు. సూజిట్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న విడుదలైంది. ఈ సినిమా అంతట మంచి కలెక్షన్లతో ప్రదర్శించబడుతోంది.