ఉద్యమల ప్రభావం చరణ్ సినిమా ‘తూఫాన్’ పై పడనుందా?

Thoofan (1)
సమైక్యాంద్ర, తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్ లో సెప్టెంబర్ 7న సభలను నిర్వహించనున్నారు. ఆంధ్రపదేశ్ ఎన్.జి.ఓ ల అసోషియేషన్ సమైక్యాంద్ర పేరుతో హైదరబాద్లో ఒక సభని నిర్వహించనున్నట్లు తెలిపింది. దానికోసం ఆ రోజున సమావేశం నిర్వహించడానికి పోలీసు అధికారుల నుండి అనుమతిని కూడా కోరడం జరిగింది. అలాగే అదే రోజున ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా మిలియన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించలని పిలుపునిచ్చింది. దీనికోసం వీరు కూడా పోలీసు అధికారులను అనుమతి కోరడం జరిగింది. అయితే ఇప్పటివరకు పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికారులు తప్ప మిగిలిన వారు వీరిద్దరికి అనుమతులు ఇవ్వవచ్చునని బావిస్తున్నారు.

ఆ రోజున హైదరాబాద్ మొత్తం టెన్షన్ గా ఉండవచ్చునని అందరూ అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు ఇక్కడ వారి వారి బలాలను చూపించనున్నాయి. ఈ ఉద్యమాల ప్రభావం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘తూఫాన్’ సినిమాపై పడనుందా? ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలకానుంది. ఈ సినిమా హిందీ వర్షన్ ని షెడ్యూల్ ప్రకారం అదే రోజున విడుదల చేస్తున్నారు. కానీ తెలుగు వర్షన్ మాత్రం వాయిదా పడనుందా? ఏం జరుగుతుందో చూడాలి. ఈ సినిమా నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version