మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు

happy-birthday-chiranjeevi

ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో అయిన మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు. నేడు ఆయన 58వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మూడు దశాబ్దాలు తెలుగులో హీరోగా కొనసాగి ఎన్నో టాప్ గ్రాసర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1955 లో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోజన్మించిన చిరంజీవి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదట్లో ఓ చిన్న ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగాడు. ఆయన 80లలో చేసిన సినిమాల్లో తన డాన్సులతో, ఫైట్స్ తో విపరీతంగా ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నారు.

2006 లో చిరంజీవికి గవర్నమెంట్ అఫ్ ఇండియా పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇప్పటి వరకు 149 సినిమాలు చేసిన చిరంజీవి 5 సార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు. చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. మొదటగా ఆయన పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆ ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం చిరంజీవి పర్యాటక శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు.

చాలా రోజులుగా చిరు ఫ్యాన్స్ మళ్ళీ ఆయన కెమరా ముందుకు వచ్చి తన 150వ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ నుండి ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం బయటకి రావడం లేదు.

మెగాస్టార్ చిరు పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version