ఆమె ఆకృతి ఐటెం సాంగ్స్ కి పర్ఫెక్ట్ అంటోంది.!

shriya-saran

తెలుగు, తమిళ్, హిందీ ఇలా మూడు భాషల్లో సినిమాలు చేసిన అందాల భామ శ్రియ సరన్ హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్నప్పుడే ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శ్రియ సరన్ ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసినా అడపాదడపా నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేసింది.

ఈ భామని ఐటెం సాంగ్స్ చేయడానికి గల కారణంమరియు నటిగా ఏ స్థానంలో ఉన్నారు అని అడిగితే ‘ నటి అంటే ఒకే తరహా పాత్రలకు పరిమితం అవ్వకూడదు. చెప్పాలంటే నా దేహ ఆకృతి ఐటెం సాంగ్స్ కి బాగా సరిపోతుంది. అందుకే ఐటెం సాంగ్స్ చేసాను. ఇక నా స్థానం అంటారా.. కెరీర్ ముగిసిపోయింది అనుకుంటేనే స్థానం కోసం వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా ప్రయాణం ఇంకా కొనసాగుతోందని’ శ్రియ సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం శ్రియ అక్కినేని ఫ్యామిలీ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ఫిల్మ్ ‘మనం’లో నటిస్తోంది. ఈ మూవీలో నాగార్జునకి జోడీగా శ్రియ నటిస్తోంది.

Exit mobile version