మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ పై చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన సమంత నటిస్తుంది. హరీష్ శంకర్ ఈ సినిమా విశేషాల గురించి ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే వున్నాడు. మరీ ముఖ్యంగాఎన్.టి.ఆర్, సమంతల నటనను తెగ పొగిడేస్తున్నాడు.
ఈరోజు థమన్ ను పొగిడేపనిపెట్టుకున్న హరీష్ తన ట్విట్టర్లో “‘ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు థమన్ తన కెరీర్లో బెస్ట్ ఆల్బంను అందించాడు… చాలా ఉత్సాహంగావుంది. ఆడియో విడుదల తేదిని త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపాడు.
ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో శృతిహాసన్ నటిస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఆల్బం విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తారు. సినిమా సెప్టెంబర్ 27న విడుదలకానుంది