కొన్ని రోజుల క్రితం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందాన్ని ఏడిపిస్తూ పవన్ కళ్యాన్ సొంతంగా ఒక పాట పాడాడన్నా విషయం మా ద్వారానే తెలిసింది అని మీకు తెలిసిందే. ఈ షార్ట్ బిట్ నెంబర్ ను రేపు విడుదల చెయ్యనున్నారు.
ఈ సినిమా సెన్సార్ పనులను ముగించుకుని, ఆగష్టు 9న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు బి.విఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు
సమంత ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ప్రణీత రెండో హీరోయిన. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ను సాధిస్తుందని అంచనా