తెలుగు తెరపైకిరానున్న అర్జున్ కూతురు

aishwarya-arjun

సినీరంగంలో తారల బిడ్డలు తెరపైకి పరిచయంకావడం కొత్త విషయం ఏమి కాదు. ఈ పరంపరను కొనసాగిస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ అందాల కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చెయ్యనుంది. ఫిలింనగర్ కధనాల ప్రకారం ఒక పెద్ద తెలుగు హీరో సరసన ఐశ్వర్య హీరోయిన్ గా నటించడానికి రంగం సిద్ధమయ్యింది

ఐశ్వర్య ఇప్పటికే తమిళంలో శింబు సరసన ‘పోడా పొడి’ అనే సినిమాలో నటించింది. తెలుగు తెరకు అర్జున్ పరిచయస్తుడే కాబట్టి తన కూతురి మొదటి సినిమాను టాలీవుడ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు

Exit mobile version