చివరిదశ షూటింగ్ లో ‘బీమవరం బుల్లోడు’

Bhimavaram Bullodu Working Stills (12)

ప్రస్తుతం కామెడీ హీరో సునీల్ నటిస్తున్న సినిమా ‘భీమవరం బుల్లోడు’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమా ఈ సంవత్సరం తరువాత విడుదలైయ్యే అవకాశం వుంది. ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ‘కలిసుందాం రా’, ‘ప్రేమతో రా’ ఫేం ఉదయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ కి భీమవరంలో మంచి పాపులారిటి ఉంది. దీనితో ఈ సినిమా నిర్వాహకులు దీనిని కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ‘బీమవరం బుల్లోడు’ సినిమా హై కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Exit mobile version