మంచు వారి విషయంలో హ్యాపీగా ఉన్న లావణ్య

ARLAVANYA

‘అందాల రాక్షసి’ సినిమాతో లావణ్య ఆంధ్ర ప్రదేశ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపరిచినా లావణ్య చార్మింగ్ లుక్స్, పెర్ఫార్మన్స్ విషయంలో అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం మంచు విష్ణు తో కలిసి ‘దూసుకెళ్తా’ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే లావణ్య కి తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి ట్విట్టర్ లో సమాధానమిచ్చింది. మంచు ఫ్యామిలీతో గురించి, వారితో పనిచేస్తున్న అనుభవం గురించి అడిగితే ఆమె ఎంతో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.

‘వాళ్ళంతా ఎంతో వినయంగా, నిక్కచ్చిగా ఉంటారు. మోహన్ బాబు సార్ చాలా మంచి వారు, ఆయన ప్రతి ఒక్కరి గురించి కేర్ తీసుకుంటారు. అలాగే విష్ణుతో పనిచేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుందని’ లావణ్య ఓ ఫ్యాన్ కి సమాధానమిచ్చింది. వీరూ పోట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Exit mobile version