పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మాన్’ సినిమా బెంగాలీలోకి రీ-మేడ్ కానుంది. గత కొన్నేళ్ళగా ‘విక్రమార్కుడు‘, ‘గమ్యం’, ‘కృష్ణ’ వంటి పలు తెలుగు సినిమాలు బెంగాలీలోకి తర్జుమా అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మహేశ్, కాజల్ ల సినిమా కుడా చేరింది. బెంగాలీ సినీ పరిశ్రమలో పెద్ద నటుడైన జీత్ ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. ‘బాస్’ అనే టైటిల్ తోతెరకెక్కిన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా త్వరలో పశ్చిమ బెంగాల్ మరియు ఇండియాలో పలు ప్రదేశాలలో విడుదలకానుంది