నైజాంలో పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న రొమాన్స్

Romance

‘ఈ రోజుల్లో’ తీసిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నా ‘రొమాన్స్’ సినిమాని నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ లో 54 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. నైజాం ఏరియా మొత్తంగా 140 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఒక చిన్న బడ్జెట్ సినిమా ఎన్ని ఎక్కువ థియేటర్స్ రిలీజ్ కావడం చెప్పుకోదగిన అంశం. యువతని, సి సెంటర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న మారుతి ఈ సినిమాని మారుతి సమర్పిస్తున్నాడు. అతని ట్రాక్ రికార్డ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం ఆశిస్తోంది.

గుడ్ సినిమా గ్రూప్ వారు నిర్మించిన ఈ సినిమాకి డార్లింగ్ స్వామి డైరెక్టర్. ప్రిన్స్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. మాములుగా అనుకున్న ‘ఎవడు’ సినిమా రిలీజ్ వాయిదా పడడం వల్ల బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం.

Exit mobile version