తెలుగు చిత్రసీమలో తమన్నా పేరు ప్రస్తుతం తక్కువగానే వినిపిస్తుందనిచెప్పాలి. ‘తడాఖా’ సినిమా విజయం సాధించిన తరువాత మొన్న మహేష్ బాబుతో ‘ఆగడు’ సినిమాలో నటిస్తుందని తెలిపే అంతటి వరకూ ఆమెను ఎవరూ గుర్తుచేసుకోలేదు. మహేష్ తో సినిమా త్వరలో మొదలుకానుంది. అంతలోగా ఈ భామ హిందీలో సంతకంచేసిన ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ యాక్షన్ కామెడీలో అక్షయ్ కుమార్ సరసన తమన్నా కనిపిస్తుంది. గతంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘హిమ్మత్ వాలా’ నిరాశపరచడంతో తమన్నాకు ఇప్పుడు తప్పనిసరిగా హిట్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాంకాక్ లో కొన్ని ముఖ్య ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ సన్నివేశాలలో తమన్నా, అక్షయ్, ప్రకాష్ రాజ్ మరియు సోను సూద్ నటిస్తున్నారు. సాజిద్ – ఫర్హాద్ స్క్రిప్ట్ పనులేకాక దర్శకత్వ భాద్యతలు సైతం చేపట్టారు. రమేష్ తౌరాని నిర్మాత