ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రతి ఒక్కరు తమ ఉపిరిని బిగపెట్టుకొని మరీ ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఏమిటి? అనేదాని గురించి ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రాని కల్లా తెలంగాణ ప్లాన్ తెలియజేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తర్వాత పొలిటికల్ పార్టీల్లో భారీ ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ విషయం వరుసగా రిలీజ్ అవ్వనున్న ఎన్నో పెద్ద సినిమాలకు బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది.
అది కాకుండా షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద సమస్యలేమీ ఉండవు కానీ విడిపోయిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి లాంగ్ టర్మ్ రన్ అనేది ఎలా ఉంటుందా అనేది అందరినీ భయాందోలనకి గురిచేస్తోంది. కొత్త రాష్ట్రం క్రియేట్ అవ్వగానే టాక్స్ విషయంలో, ఉద్యోగుల కోటా, మొదలైన విషయాలను ఒక్కసారిగా మొదలవుతాయి.
మనకు తెలిసిన దాని ప్రకారం జూలై 30 ఏనా ఆంధ్ర ప్రదేశ్ కి ఆఖరి రోజు?