విజయ్, అమలాపాల్ జంటగా నటించిన ‘తలైవా’ సినిమా తెలుగులోకి ‘అన్న’ అనే పేరుతొ అనువాదం కానుంది. ‘బోర్న్ టు లీడ్’ అనేది దీని ఉపశీర్షిక. ‘మదరాసిపట్టణం’, ‘తాండవం’ వంటి సినిమాలను తీసిన ఏ.ఎల్ విజయ్ ఈ సినిమాను తీసాడు. తమిళంలో భారీ విడుదల కాబోతున్న ఈ ‘అన్న’ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ కధాంశంతో తెరకెక్కుతుంది. 2500 స్క్రీన్లపై తమిళ వెర్షన్ ను 250 స్క్రీన్లపై తెలుగు వెర్షన్ ను విడుదల చెయ్యాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. లక్ష్మి నరసింహా విజువల్స్ పై కాశీవిశ్వనాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 3కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా ఈ సినిమాను పంపిణి చేస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీత దర్శకుడు. ఆగష్టు 9న ఈ సినిమా విడుధలకావచ్చు