నితిన్ హీరోగా దిల్ రాజు సినిమా ?

Dil-Raj-and-Nithin

యంగ్ హీరో నితిన్ హీరోగా నిర్మాత దిల్ రాజు సినిమా తియబోతున్నాడని ఫిల్మ్ నగర్ వారి సమాచారం. ఈ సినిమాకి టైటిల్ గా ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమాని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, మంచి కామెడీ, రొమాన్స్ తో తెరకెక్కించ నున్నారని సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నితిన్ ఈ మద్య న్యూ లుక్ లో చాలా స్టైల్ గా కనిపిస్తూ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం తను ‘కోరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. అలాగే పూరి జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్ లో కూడా నటించనున్నాడు.
దిల్ రాజు ప్రస్తుతం ‘రామయ్యా వస్తావయ్యా’ నిర్మాణంలో బిజీగా వున్నాడు. తను నిర్మించిన ఎవడు సినిమా ఆగష్టులో విడుదలకానుంది. నితిన్, దిల్ రాజు తియబోతున్న సినిమా అధికారికంగా ప్రకటించగానే తెలియజేస్తాం.

Exit mobile version