వరుసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొట్ట మొదటి సారిగా నితిన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించనున్న ఈ సినిమాకి హార్ట్ అటాక్ అనే టైటిల్ ని పెట్టారు. ప్రస్తుతం ఒకవైపు స్క్రిప్ట్ పనులలో బిజీ గా ఉంటూనే మరో వైపు ఈ లవ్ స్టొరీ కి పర్ఫెక్ట్ గా సరిపోయే హీరోయిన్ కోసం వేటలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు నిత్యా మీనన్ తో జత కట్టిన నితిన్ తన కొత్త మూవీ కొరియర్ బాయ్ కళ్యాణ్ లో యామి గౌతంతో జోడీ కట్టాడు. ప్రస్తుతం పూరి ఈ సినిమాకి బాగా ఫేం ఉన్న హీరోయిన్ ని తీసుకుంటాడా లేక కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా నితిన్ కరుణాకరన్ తో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు.