‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు గారి కుమారుడు మాదాల రవి పూర్తిగా సినిమాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా కాలం క్రితం రవి హీరోగా ‘నేను సైతం’ అనే సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ లో ఉన్న కమిట్ మెంట్స్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. మాదాల రవి సోవియట్ లో ఓ డాక్టర్. గ్యాప్ తర్వాత మళ్ళీ రవి సినిమాల్లోకి రానున్నాడు. అక్టోబర్ నుంచి అతను ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అది కాకుండా వరుసగా తెలుగు సినిమాల్లో నటించడానికి డిసైడ్ అయ్యాడు. ఈ రోజు మాదాల రవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నా కొత్త సినిమా గురించి త్వరలోనే తెలియజేస్తాను. అలాగే నేనే నిర్మిస్తాను. అలాగే ఇక నుంచి రెగ్యులర్ గా సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని’ తెలిపాడు.