తిరుపతిలో సందడి చేస్తున్న దూసుకెళ్తా టీం

Doosukeltha-(2)
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమా ష్ట్తోటింగ్ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతోంది. ఈ కామెడీ మూవీలో విష్ణు సరసన అందాల రాక్షసి ఫేం లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు తిరుపతిలోని శ్రీ పద్మావతి టెంపుల్ దగ్గద హర్ హీరోయిన్ పై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసారు. దీన్తి తరటావ ఈ చిత్ర టీం తిరుపతికి వెళ్ళింది. ఇటీవలే ఈ సినిమాలో మంచు విష్ణు పై వచ్చే టైటిల్ సాంగ్ ని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసారు. వీరు పొట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మంచు విష్ణు ఈ సినిమా కాకుండా మోహన్ బాబు, మంచు మనోజ్, రవీనా టాండన్, హన్సిక, ప్రణిత, వరుణ్ సందేశ్, తనిష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. శ్రీవాస్ ఈ సినిమాకి డైరెక్టర్.

Exit mobile version