క్రియేటివ్ డైరెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు

Krishna-Vamshi
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పిలుచుకునే కృష్ణ వంశీ ఈ రోజు తన 51వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈయన ఆంధ్రపదేశ్ తాడేపల్లి గూడెం లో జన్మించిన ఆయన అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో ఆగ్రా యూనివర్శిటీలో ఎంఏ చేసారు, ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత డైరెక్టర్ అయ్యారు. ‘గులాబి’, ‘సింధూరం’, ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాలను తీసి క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ మూడు సినిమాల కంటెంట్, టేకింగ్ పరంగా ఆయనకీ చాలా ప్రశంశలు దక్కాయి. అలాగే ‘అంతఃపురం’, ‘మురారి’, ‘ఖడ్గం’ సినిమాలు ఆయన కెరీర్లో మరింత పేరు తెచ్చి పెట్టాయి. ఆయన తాజాగా నానితో ‘పైసా’ సినిమా చేస్తున్నారు, ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ పొలిటికల్ డ్రామా సినిమాలో నాని సరసన కేథరిన్ హీరోయిన్ గా నటించింది. గత కొద్ది సినిమాల నుంచి కృష్ణ వంశీ తన మేజిక్ తో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. మళ్ళీ పైసా తో తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version