గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరాలను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క సంగీతాన్నీ, నేపధ్య సంగీతాన్నీ లండన్ ఆయన నుండి అందిస్తున్నారు. సమాచారం ప్రకారం ఆయన బాణీలతో మనకు మరో మధురస్మృతిని అందించనున్నారట
చారిత్రాత్మక నేపధ్యంలో సాగుతున్న ఈ సినిమాలో అనుష్క ప్రజల మన్ననలను అందుకున్న రాణీ రుద్రమదేవి పాత్రను పోషిస్తుంది. టాలీవుడ్ మ్యాచో హీరో రానా చాళుక్య వీరభద్ర పాత్రను పోషిస్తున్నాడు
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గుణశేఖర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. నాయనానందకరమైన సెట్లతో, నమ్మశక్యం కాని అద్భుత విజువల్ ఎఫెక్ట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.