మంచు మనోజ్ ‘పోటుగాడు’ ఆగష్టులో విడుదలకు సిద్ధమయ్యింది. పవన్ వాడేయర్ దర్శకుడు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు సిమ్రాన్ కౌర్ ముండి ,అను ప్రియ, రాచెల్, సాక్షి చౌదరి వున్నారు . ఈ సినిమాను రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష మరియు శ్రీధర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యకరమాలను ముగించనున్నాయి . మనోజ్ ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ తోనూ ప్రేమలో పడతాడట. తన పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా వుంటుందని, ఈ సినిమాకు అదే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపాడు. చక్రి మరియు అచ్చు సంగీతాన్ని అందించారు