రజనికాంత్ తాజా చిత్రం ‘కొచ్చాడయాన్’ చాలాకాలంగా నిర్మాణ దశలోవుంది. దర్శకనిర్మాతలు కుడా సినిమా విడుదల ఎప్పుడు వుంటుందో ఎటువంటి వివరణ ఇవ్వటంలేదు. ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టడానికి అత్యాధునిక గ్రాఫిక్స్ పరిజ్ఞానాన్ని వాడుతుండడం వల్ల నిర్మాణాంతర కార్యక్రమాలలో జాప్యం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ వారంలో విడుదలచేస్తారట. ఈ సినిమాలో రజిని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్. ‘టిన్ టిన్’, ‘అవతార్’ వంటి ప్రముఖ సినిమాలకు వాడిన పరిజ్ఞానాన్ని ఇక్కడ కుడా వాడుతున్నారు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. యూరోస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిఎమ గురించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తాం