‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్బంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు సంబందించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆహా నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ కూడా సమానంగా వుండనున్నాయని సమాచారం.