యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమా టీం ఆగష్టు చివరి వారంలో నాలుగు రోజులు షూటింగ్ కోసం యూరప్ వెళ్ళనుంది. ఈ షెడ్యూల్ లో బాగంగా ఈ టీం స్పెయిన్, ఇటలీలో కొన్ని ప్రదేశాలలో షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమాంత హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.