దక్షిణాదిన వున్ననాలుగు భాషలలో దర్శకులు, నిర్మాతలు, నటులు మరియు ఇతర టెక్నిషియన్స్ అంతా కలిసి చెన్నైలో జరగనున్న 100ఏళ్ళ ఇండియన్ సినిమా వేడుకలో దక్షిణాది సినిమా జయకేతనాన్ని ఎగురవేయనున్నారు. ఈ వేడుక నెహ్రు స్టేడియంలో సెప్టెంబర్ 25 నుండి 27 వరకూ జరగనుంది. వేడుక నిర్వాహకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీను ముఖ్య అతిధిగా, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాన అతిధులుగా ఆహ్వానించారు. వీరేకాక బాలీవుడ్ నుండి పలు ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఇంత ఘనరీతిలో వేడుకను జరుపుతున్న వీరు అపశృతికి ఏ ఒక్క ఆస్కారం లేకుండా ప్రయత్నిస్తున్నారు . ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ వేడుకపై చాలా ఉత్సాహంచూపుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు