అప్ డేట్: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘కెవ్వు కేక’ సినిమా ఆడియోని జూలై 1న విడుదల చేయనున్నారని తెలియజేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆడియోని జూలై 1న కాకుండా ఒకరోజు ముందుగా జూన్ 30న విడుదల చేయనున్నారు. ‘ఎవడు’ ఆడియోని జూలై 1న విడుదల చేయనుండడంతో ‘కెక్కు కేక’ టీం ఈ సినిమా ఆడియోని జూన్ 30 విడుదల చేయనున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆరోజు నరేష్ పుట్టినరోజు కూడా.
కామెడి కింగ్ అల్లరి నరేష్ తాజా చిత్రం ‘కేవ్వుకేక’ ఆడియో ముందుగా అల్లరి నరేష్ పుట్టినరోజు అయిన జూన్ 30న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వేడుకను జూలై 1కు మార్చారు. దీనికి సంబంధించిన కారణాలు తెలియలేదు. చిన్ని చరణ్ సంగీత దర్శకుడు
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన షర్మిలా మాండ్రే నటిస్తుంది. బొప్పన చంద్ర శేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి ప్రసాద్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి
‘కెవ్వుకేక’ పూర్తిగా అల్లరి నరేష్ స్టైల్ లో సాగే సినిమా. ఇందులో చాలా మంది సీనియర్ కామెడి నటులు కుడా కనిపించనున్నారు