‘ముని 3’ సినిమా పనులలో రాఘవ లారెన్స్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను అతను దర్శకత్వం వహించడమే కాక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాప్సీ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాప్సీ ఈ సినిమా తన కెరీర్లోనే దమ్మున్న పాత్రని, అంతేకాక ఇది తన మొదటి హర్రర్ కామెడి సినిమా అని చెప్పింది. ఈ సినిమాకు గాను తాను చాలా కష్టపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం చెన్నైలో ఈమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు. ఒకానొక సన్నివేశానికిగాను ఆమె 12గంటలు నీళ్ళలో గడపవలిసి వచ్చింది. దానికోసం ఏవిధమైన డూప్ లేకుండా రక్షణా చర్యలు తీసుకోకుండా నటించింది. ఈ సినిమా ‘కాంచన’ కంటే హాస్యభరితంగా, భయంకరంగా ఉంటుందని లారెన్స్ నమ్మకంగా వున్నాడు. బెల్లంకొండ సురేష్ తెలుగు వెర్షన్ నిర్మాత. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలవుతుంది