మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పొడుగు కాళ్ళ సుందరి శృతి హసన్ లపై ‘ఎవడు’ సినిమా కోసం హైదరాబాద్లో మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ ని అన్నపూర్ణ 7 ఎకర్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ సాంగ్ కి శేఖర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జూలై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోని జూన్ 30న విడుదల చేయనున్నారు.
ఈ థ్రిల్లర్ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా చాలా ఇంటరెస్టింగ్ గా, నవల ఇతి వృత్తంగా ఉండనుందని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.