మన ఇండియన్ సంగీత ప్రపంచంలో మాస్ట్రో ఇళయరాజా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. యూనివర్సల్ స్టార్ కమల హాసన్ – ఇళయరాజా కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు కమల్ కి అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం ఇళయరాజ తనయుడిగా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సాంగ్స్ తో దూసుకుపోతున్న యువన్ శంకర్ రాజాకి వచ్చింది. యువన్ మొదటిసారి కమల్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. యువన్ తన ఫాదర్ లానే కమల్ తో సూపర్బ్ ఆడియో అందిస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం విశ్వరూపం 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న కమల్ ఆ సినిమా పూర్తి చేసి ఓ కొత్త సినిమాని ఆగష్టులో ప్రారంభించనున్నాడు. ఈ సినిమాలో కమల్ హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఫేమస్ డైరెక్టర్ అయిన లింగు స్వామి ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమాకి తమిళ్లో ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.