‘ఆదర్శ కుటుంబం’.. ఫ్యామిలీ మ్యాన్ కి పర్ఫెక్ట్ టైటిల్!

Aadarsha Kutumbam House

మన టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా కొన్నాళ్ల కితం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది గత కొన్నాళ్ల నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ గా వైరల్ అవుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా టైటిల్ ఐ రివీల్ చేసేసారు.

ఈ చిత్రానికి “ఆదర్శ కుటుంబం” అంటూ ఫ్యామిలీ మ్యాన్ కి తగ్గట్టుగా ఒక పర్ఫెక్ట్ టైటిల్ ని పెట్టారు.. ఇక ఈ టైటిల్ లోనే హోమ్ నెంబర్ 47, ఏకే 47 అంటూ కూడా హైలైట్ చేయడం విశేషం. ఇక ఇందులో వెంకీ మామ లుక్ కూడా మంచి ఫ్రెష్ గా కనిపిస్తుండగా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి తెస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేసేసారు. అలానే సినిమా షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచే మొదలు పెట్టినట్టు తెలిపారు. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి నటిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version