Varanasi : ఆ విషయంలో ‘వారణాసి’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా..?

Varanasi

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రం ‘వారణాసి’(Varanasi) ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తనదైన రీతిలో అత్యంత ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలోని ఓ వర్గం సమాచారం ప్రకారం.. “ఈ చిత్రానికి హాలీవుడ్ స్థాయి రేంజ్‌లో డిజిటల్ డీల్ ఇవ్వడానికి ఓటీటీలు ఆసక్తిగా ఉన్నాయట. ఈ డీల్ మొత్తం రూ.1000 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది” అని వెల్లడించారు.

ఈ చిత్ర కథను విజయేంద్ర ప్రసాద్ రాస్తుండగా, దేవ కట్టా అదనపు స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. సినిమా శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.

Exit mobile version