
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో పెద్ది అనే ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన కెరీర్ 17వ చిత్రంగా దర్శకుడు సుకుమార్ తో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని తాను చేయనున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సైతం ఈ సినిమాలో ఎంట్రీ సీన్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. అలాంటిది ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వైరల్ అవుతుంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఫైనల్ గా ఈ సినిమా టోటల్ స్క్రిప్ట్ ని లాక్ చేసేయగా షూటింగ్ ని కూడా ప్లాన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. మార్చ్ లో రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయ్యాక ఒక రెండు నెలల గ్యాప్ లో సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఈలోపు అవసరమైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతటినీ కంప్లీట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.