రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి మంచి సక్సెస్ ని సాధించిన చిన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే కాకుండా దీనికి ముందు వచ్చిన “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” అనే సినిమా కూడా ఒకటి. చాలా లిమిటెడ్ గానే వచ్చి మంచి సర్ప్రైజింగ్ హిట్ గా నిలిచింది. టాలెంటెడ్ హీరో తిరువీర్ నటించిన ఈ సినిమాని దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించగా ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమాని జీ వారు సొంతం చేసుకోగా ఈ కూల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరి అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఈసారి డెఫినెట్ గా ఇందులో చూసి ఎంటర్టైన్ కావచ్చు. ఇక ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. అలాగే అగరం సందీప్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
