ఆ బ్యానర్‌తో సందీప్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు..?

sandeep-reddy-vanga

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్‌, సందీప్ వంగా స్టైల్‌కు ఉన్న డిమాండ్ వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూ్స్ చేస్తోంది. ఇదిలా ఉండగా, సందీప్ వంగా టీ-సిరీస్‌తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా మూడు చిత్రాలను ఈ బ్యానర్‌లో చేసేందుకు ఆయన డీల్ కుదుర్చుకున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.

ఓ బాలీవుడ్ బ్యానర్‌తో ఇంత పెద్ద డీల్‌ సైన్ చేసిన తొలి తెలుగు దర్శకుడిగా సందీప్ వంగా నిలిచాడని చెప్పాలి. అయితే, ఈ డీల్ ప్రకారం తొలి సినిమాను ప్రభాస్‌తో చేస్తున్న సందీప్, తన నెక్స్ట్ రెండు చిత్రాలను ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version