ఇప్పుడు ప్రపంచమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ చిత్రమే ‘అవతార్ – ది ఫైర్ ఆండ్ యాష్’. దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ అవతార్ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమాగా రాబోతుంది. ఇక ఈ ఎపిక్ విజువల్ ట్రీట్ ఈ డిసెంబర్ నెలలో ఒకో తేదీన ఒకో దేశంలో విడుదల కాబోతుండగా ఈ ఒక్క సినిమా కోసమే కాకుండా ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ల నుంచి క్రేజీ ట్రీట్ లు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా థియేటర్స్ లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా ‘ఒడెస్సి’ అలాగే అవెంజర్స్ ఫ్రాంచైజ్ నుంచి సెన్సేషనల్ హైప్ ఉన్న “అవెంజర్స్ – డూమ్స్ డే” ట్రైలర్ ఇక మూడో ట్రైలర్ గా జేమ్స్ కేమెరూన్ లానే మరో టాప్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తెరకెక్కిస్తున్న ‘యూ ఎఫ్ ఓ’ సినిమాల ట్రైలర్ లు మూడు ప్లే కానున్నాయట ఇది మాత్రం సినిమా లవర్స్ కి అవతార్ 3 థియేటర్స్ లో పెద్ద పండుగే అని చెప్పాల్సిందే. మరి ఇండియాలో కూడా ఇవి వస్తాయో లేదో అనేది చూడాల్సిందే.