పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ లైనప్ లో తన నుంచి స్టార్ట్ కానున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న స్పిరిట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కి సంబంధించి ఓ టాక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకి భారీ మొత్తంలోనే ఈ డీల్ అన్నట్టు టాక్ వినిపిస్తుంది.
కానీ ఈ టాక్ లో నిజం లేదనే అనుకోవాలి. ఒక పక్క ప్రభాస్ ఇంకోపక్క సందీప్ వంగ లాంటి దర్శకున్నీ పెట్టుకొని కేవలం 160 కోట్ల డీల్ అంటేనే నమ్మశక్యంగా లేదు. గతంలో కల్కి 2898 ఎడి కేవలం హిందీ ఓటీటీ డీల్ నే 170 కోట్లకి పైగా పలికింది. అలాంటిది ఇప్పుడు స్పిరిట్ రూమర్స్ అస్సలు నమ్మదగే రీతిలో లేనే లేవు. సో ఈ టాక్ ఒట్టి గాలి వార్తే అనుకోవాలి. అసలు డీల్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
