సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బోయపాటి ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయినట్లు ప్రకటించారు.

ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు బోయపాటి తెలిపారు. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఇలాంటి గొప్ప సినిమాను తీసినందుకు అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అభినందిస్తారని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 45 నిమిషాలకు రన్‌టైమ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Exit mobile version