‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పై లేటెస్ట్ అప్ డేట్ !

హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు పి మహేష్ బాబు తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా”. తాజాగా ఈ సినిమా మిక్సింగ్ పూర్తయింది, ఫైనల్ కాపీని అన్ని ప్రాంతాలకు పంపాం అని మేకర్స్ అధికారికంగా తెలిపారు. నవంబర్ 26న యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్‌ లు పడబోతున్నాయి. ఇక నవంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. కాగా ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ నవంబర్ 27న తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అన్నట్టు ఈ సినిమా కోసం రామ్ మొట్ట మొదటిసారిగా పాటల రచయితగా కూడా మారాడు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ కూడా ఈ సినిమా రిలీజ్ పై ఆసక్తిగా ఉన్నారు.

Exit mobile version