టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే అఖండ 2. తన నుంచి నాలుగు వరుస హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడం పైగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆడియెన్స్ లో పీక్స్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ నేడు గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ ట్రైలర్ కి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు.
కర్ణాటకలో గ్రాండ్ ఈవెంట్ ఈ సాయంత్రమే మొదలు కానుండగా ట్రైలర్ ని అఖండ 2 సర్జికల్ స్ట్రైక్ అంటూ రాత్రి 7 గంటల 56 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు సాలిడ్ అప్డేట్ అందించారు. ఇక దీనిపై డిజైన్ చేసిన బాలయ్య పోస్టర్ కూడా మంచి పవర్ఫుల్ గా ఉంది. సో ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఈ డిసెంబర్ 5న 3డి లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది.
