పెద్ద నిడివితోనే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’?

Andhra King Taluka

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ఆంధ్ర కింగ్ తాలూకా. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. దీని ప్రకారం ఆంధ్ర కింగ్ తాలూకా కి గట్టి రన్ టైం నే లాక్ అయినట్లు తెలుస్తోంది.

మరి దీని ప్రకారం ఈ సినిమా 2 గంటల 45 నిమిషాలు నిడివితో రాబోతుంది అట. సో ఇంటర్వెల్ తో కలిపి 3 గంటలు అనుకోవాలి. మరి ఎంతసేపూ ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version