మాజీ బ్యూటీ అమీషా పటేల్ ప్రస్తుతం సినిమాలు లేక, సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు అప్ డేట్ చేసుకుంటూ వస్తోంది. ఐతే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా అమీషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా ఏజ్‌లో సగం ఉన్న కుర్రాళ్లు కూడా నన్ను డేటింగ్‌కు పిలుస్తున్నారు. అయితే, నేను మాత్రం ఈ ప్రపోజల్స్ ను సీరియస్‌గా తీసుకోను. కానీ మంచి వ్యక్తి అయితే ఏ వయసైనా ఓపెన్‌గా ఆలోచిస్తాను’ అంటూ అమీషా పటేల్ కామెంట్స్ చేయడం విశేషం.
కాగా అమీషా పటేల్ తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ.. “ఇక నా పెళ్లి విషయంలో నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకుంటాను. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే. అయినా, నాలో ఇంకా టీనేజ్ లక్షణాలు పోలేదు. అందుకే, నేను ఇప్పటికీ గ్లామరస్ గా కనిపిస్తూ ఉంటాను. అందుకే, కుర్రాళ్ళు నన్ను ఇష్టపడుతూ ఉంటారు’ అంటూ అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా వయసు 50 దాటినా అమీషా మాత్రం ఫిట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది.
