యూఎస్ మార్కెట్ లో ‘శివ’ స్ట్రాంగ్ వసూళ్లు!

అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో చేసిన మొదటి చిత్రం “శివ”. మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వసూళ్ల పరంగా ఎలా అదరగొట్టిందో మళ్ళీ రీరిలీజ్ అయ్యాక కూడా రీరిలీజ్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి సాలిడ్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకోవడం విశేషం.

ఇక లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇలా అక్కడ 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని అందుకొని ఈ సినిమా రాబట్టింది. దీనితో అక్కడ కూడా రీరిలీజ్ చిత్రాల్లో టాప్ లిస్ట్ లో ఈ సినిమా చేరింది. దీనితో శివ మరోసారి మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్ తదితరులు నటించారు.

Exit mobile version