తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ చిత్రమే “శివ”. కింగ్ నాగార్జున హీరోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా మన టాలీవుడ్ రీరిలీజ్ లలో ఒక మోస్ట్ అవైటెడ్ రీరిలీజ్ కూడా. దీనితో ఎట్టకేలకి మళ్ళీ థియేటర్స్ లో రీలీజ్ కి వచ్చిన ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ ఇపుడు వస్తుంది. అభిమానులు మాత్రమే కాకుండా జెనరల్ ఆడియెన్స్ కూడా ఈ ఎపిక్ చిత్రాన్ని థియేటర్స్ లో విట్నెస్ చెయ్యాలని ఎదురు చూసారు.
మరి దానికి ఫలితమే ఇప్పుడు సినిమా బుక్ మై షోలో హవర్లీ ట్రెండింగ్ లో కూడా నిలిచింది. ఇలా ప్రతీ గంటకి ఈజీగా వెయ్యికి పైగా టికెట్స్ ఇపుడు ఈ సినిమాకి తెగుతున్నాయి. దీనితో శివ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర కింగ్ నాగ్ తన మాస్ చూపిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమల నటించగా రఘువరన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
#SHIVA4K is trending hourly on BMS ???????? ????????
Audiences are spellbound experiencing #SHIVA in breathtaking 4K and powerful Atmos sound ❤️????
Book your tickets now!
— https://t.co/vdUYG2IPyS#50YearsOfAnnapurna #ANRLivesOnKing @iamnagarjuna @RGVzoomin @amalaakkineni1… pic.twitter.com/lGtldmgPx1
— Annapurna Studios (@AnnapurnaStdios) November 14, 2025
