లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన పలు సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా అనౌన్స్ చేసిన సినిమా కూడా ఒకటి. రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ సినిమాని దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నారని ముందు కన్ఫర్మ్ చేశారు.
కానీ అనూహ్యంగా తాను తప్పుకొని అందరికీ షాకివ్వడంతో ఈ సినిమా ప్రశ్నార్ధకంగా మారింది. అయితే లేటెస్ట్ గా తమిళ్ సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా ఆగిపోలేదని ప్లానింగ్ ఉన్న షెడ్యూల్స్ ప్రకారమే మొదలు కావడానికి రెడీగా ఉంది అంటూ కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ ఆన్ టైం స్టార్ట్ అయితే అసలు దర్శకుడు లేకుండా ఎలా తెరకెక్కిస్తారు అనేది కూడా సస్పెన్స్ గా మారింది.
ప్రస్తుతాని మరో దర్శకుడు సుందర్ సి స్థానాన్ని భర్తీ చేసినట్టుగా ఎక్కడా కన్ఫర్మేషన్ రాలేదు. ఇది సస్పెన్స్ గా ఉండగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని తమిళ్ సినీ వర్గాల్లో టాక్ ఉంది. మరి దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.
