ఈ ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘డ్యూడ్’

dude is now streaming

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నేహా శెట్టి అలాగే మమిత బైజు హీరోయిన్స్ గా దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించిన దీపావళి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “డ్యూడ్”. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ ఆడియెన్స్ అంచనాలు అందుకొని 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. మరి ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు డెఫినెట్ గా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version