‘స్పిరిట్’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్‌’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా నుండి వజువల్స్ లేకుండా వచ్చిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే, తాజాగా ఈ చిత్ర ప్రోగ్రెస్‌పై సందీప్ రెడ్డి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.

‘జిగ్రిస్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “స్పిరిట్‌ షూటింగ్‌ నవంబర్‌ చివర్లో ప్రారంభమవుతుంది” అని తెలిపారు. అలాగే, ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి ఉంటారని వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఈ భారీ యాక్షన్‌ డ్రామాలో బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కాంచన ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తుండగా హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version